వి. వి. గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడపలో శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యువత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, జనాభా తగ్గుదల సమస్య, దాని ప్రభావం, తల్లిదండ్రులు, యువత, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యాపకులు వివరణ ఇచ్చారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.