ఉండి-ఆకివీడు రైల్వేస్టేషన్లో మధ్యలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భీమవరం జీఆర్పీ పోలీసులు చికిత్సకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యానికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ వ్యక్తిని గుర్తించిన వారు 99084 48729 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.