ఉండి మండలం, ఉణుదుర్రు గ్రామంలో "ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత" పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.