ఉంగుటూరులోని చేబ్రోలు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ సునీత మాట్లాడుతూ, కుష్టు వ్యాధిని ముందే గుర్తిస్తే మల్టీ డ్రగ్ థెరపీ (MDT) ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని, దీనికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని తెలిపారు. పోలియో, మసూచిని నిర్మూలించినట్లే, కుష్టు వ్యాధిని కూడా ముందస్తు జాగ్రత్తలతో తరిమి కొట్టవచ్చని ఆమె పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు, కుష్టు వ్యాధిగ్రస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.