భీమడోలు మండలం పోలసానపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా గురువారం మృతి చెందింది. భీమడోలు శివారు అర్జావారిగూడెం గ్రామానికి చెందిన లేళ్ల మానస (16) పేరెంట్స్ మీటింగ్ తర్వాత కొద్దిసేపటికే చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లుగా కళాశాల అధికారులు చెబుతుండగా తల్లిదండ్రులు, బంధువులు ఖండిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.