మంగళవారం భీమడోలు మండలం గుండెగొలను గ్రామంలో R&B నిధులతో సంత మార్కెట్ నుండి కోరుకొల్లు రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.