ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం భీమడోలు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రధాన లక్ష్యమని, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.