ఉంగుటూరు చేబ్రోలు సెక్టార్‌లోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శారద మణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముర్రుపాలు బిడ్డకు అమృతంతో సమానం అని, ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలని చెప్పారు. తల్లిపాలు శరీరం, మెదడు అభివృద్ధికి తోడ్పడతాయని, న్యుమోనియా, అతిసారం లాంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు