ఉంగుటూరు మండలం చేబ్రోలు సర్పంచి రాంధే లక్ష్మీ సునీత జాతీయస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. ‘సర్పంచ్ సంవాద్’ పోటీలో గ్రామాభివృద్ధి, భవిష్యత్ ఆలోచనలపై పంపిన 80 సెకన్ల వీడియోకు ఆమెకు మొదటి బహుమతి లభించింది. భారత నాణ్యత మండలి నిర్వహించిన ఈ పోటీలో రూ. 35 వేల నగదు బహుమతి పొందారు. ఈ పోటీలు సర్పంచుల్లో సాంకేతికత, సమన్వయం, పాలన నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్నారు.