ద్వారకాతిరుమల మండలం I. S. జగన్నాధపురం సుందరగిరిపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు.