గణపవరం ఎంపీడీఓ బేబి శ్రీలక్ష్మీ శుక్రవారం మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో అనర్హత నోటీసులు అందుకున్న దివ్యాంగులకు నవంబర్ 1వ తేదీ నుంచి యథాతథంగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని, లబ్ధిదారులు తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని ఆమె కోరారు.