గణపవరం సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బుర్రా తాతారావు అనే వ్యక్తి మృతి చెందారు. మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా అదుపుతప్పి లారీ వెనుక టైర్ల కింద పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.