శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పరిపాలనలో గణనీయ పురోగతి సాధించామని, ఉంగుటూరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు.