ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డును 16 మందితో ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డులో 13 మంది తెలుగుదేశం పార్టీకి, ఇద్దరు జనసేన పార్టీకి, ఒకరు బీజేపీకి చెందిన వారికి పదవులు దక్కాయి. ఈ నియామకాలతో ఆలయ నిర్వహణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.