ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ పరిధిలోని ఏలూరు కాలువపై ఉన్న ఆర్&బి శాఖకు చెందిన నారాయణపురం వంతెనను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల వంతెన శిథిలావస్థకు చేరడంతో, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక చొరవతో అవసరమైన నిధులు సమకూర్చి మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు కృషిని మంత్రి ప్రశంసించారు.