బాదంపూడిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పాజ్ పింఛన్ సొమ్మును ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్