ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా, నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా, కిడ్నీ డయాలసిస్‌తో బాధపడుతున్న పచ్చకుల ధనలక్ష్మికి రూ. 10,000 డయాలసిస్ పెన్షన్ సొమ్మును నేరుగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.