నిడమర్రు మండలం చిననిండ్రకొలను విశాల సహకార సంఘం ఛైర్మన్ గా పొత్తూరి నరసింహరాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛైర్మెన్ మరియు డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.