నిడమర్రు: మరికాసేపట్లో పవర్ కట్

నిడమర్రు సెక్షన్ పరిధిలో కొత్తగా 11 కేవీ విద్యుత్ లైన్ పనులు చేపడుతున్నందున, ఈ నెల 29న పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏలూరు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవర గోపవరం, చిన్న నిండ్రకొలను, తోకలపల్లి, ఆముదాలపల్లి, బైనేపల్లి ప్రాంతాల్లో సరఫరాకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్