ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో పెద్దిరెడ్డి వేణు గోపాల కృష్ణ ప్రసాద రావు, శేషవేణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో సాయిబాబా ఆలయ ధర్మకర్త ముత్తంగి వెంకట వేణు గోపాల్ , ట్రస్ట్ సభ్యులూ, గ్రామస్తులు, విద్యార్థులు, భక్తులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం మహిళలకు తాంబూలం, ప్రసాద వితరణ నిర్వహించారు.