ఏలూరు, ఉంగుటూరులో జరిగిన యూటీఎఫ్ మండల కార్యవర్గ సమావేశంలో, మండల యూటీఎఫ్ అధ్యక్షులు వునుముల రాంబాబు ఉపాధ్యాయులందరినీ యూటీఎఫ్ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన డీఏలను వెంటనే మంజూరు చేయాలని, ఐ.ఆర్. ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి డాకి జోగినాయుడు తెలంగాణ ప్రభుత్వం వలె ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించవలెనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.