ఏపీ ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి ఉంగుటూరు మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. కైకరంలో రేషన్ దుకాణం, హైస్కూలు, అంగన్వాడి సెంటర్ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నారాయణపురం హై స్కూల్లో తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉంగుటూరు హైస్కూలు రేషన్ డిపోని తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎస్ఓ, ఐసీడీఎస్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు.