బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో ఏలూరు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక నేతలతో కలిసి శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామా జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.