ఉంగుటూరు: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు

ఆగస్టు 1న ఉంగుటూరు మండలం నారాయణపురం సబ్ స్టేషన్ వద్ద మరమ్మతుల కారణంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాలలో మార్చులు చేయనున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు బుధవారం తెలిపారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం సెక్షన్ పరిధిలో నల్లమాడు, గోకవరం, కైకరం విద్యుత్ స్టేషన్లకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్