శుక్రవారం ఉంగుటూరు మండలంలోని బాధంపూడి, ఉప్పాకపాడు గ్రామాల్లో స్వచ్ఛరథం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్వచ్ఛ రథంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.