ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన వినతులను కలెక్టర్‌తో కలిసి స్వీకరించి, వారితో నేరుగా మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రెవెన్యూ అంశాలు, కొత్త పెన్షన్లకు సంబంధించిన పలు అభ్యర్థనలను ఈ సందర్భంగా స్వీకరించారు.