ఉంగుటూరు: కూటమి నాయకుల వైఖరిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి నాయకుల వైఖరిపై ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసు బాబు తీవ్రంగా స్పందించారు. శనివారం ఉంగుటూరు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపిస్తూ స్వామి వారి ప్రతిష్ఠను భంగపరిచినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్