ఉంగుటూరు: సామూహిక గృహప్రవేశాలు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అప్పారావు పేట గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద పూర్తయిన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. లబ్ధిదారు నాగలక్ష్మికి ప్రభుత్వం అందించిన రూ. 2,30,000 సహాయంతో సొంత స్థలంలో నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించి, నూతన వస్త్రాలు, ఇంటి తాళం అందజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా NDA ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్