మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన 'జనసేన జనవాణి' కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.