ఉంగుటూరు: పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉంగుటూరు మండలం చిన్న వెల్లమిల్లిలో జడ్పీ, యుపీ స్కూల్ నందు "మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్" కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం పాల్గొన్నారు. పాఠశాల విద్యా ప్రమాణాలు, పిల్లల నైతిక స్థితి, హాజరు, చదువుల ప్రగతి, వనరుల కొరత, మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించి, తగిన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్