ఉంగుటూరు: ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి

ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. బుధవారం RWS SE త్రినాధ్, DE రామారావు, AE సుబ్రహ్మణ్యం మరియు RWS ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్