గ్రామాల్లో రక్షిత తాగునీటికి ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధర్మరాజు అధికారులను ఆదేశించారు. 'పల్లె పల్లెకు పత్సమట్ల' కార్యక్రమంలో భాగంగా గురువారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో సమావేశం జరిగింది. గ్రామస్తులు డ్రైన్లు, సీసీ రోడ్ల సమస్యలపై అర్జీలు అందించారు. నారాయణపురం వైయస్సార్ కాలనీలో రూ. 5 లక్షలతో బోరు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయలాని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్ అలకనంద, ఎంపీపీ శ్రీలక్ష్మి, కూటమి నాయకులు మాలతీరాణి, గోలి శ్రీనివాస్ , రవిశంకర్, సుధీర్ , రాజారావు అధికారులు పాల్గొన్నారు.