ఉంగుటూరు: టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. నాలుగు మండలాల నుంచి తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై, వేదికను చంద్రబాబు నాయుడు పాల్గొనే సభలా తీర్చిదిద్దారు. డిజిటల్ స్క్రీన్‌లపై పార్టీ ఆవిర్భావ, విజయాల వీడియోలు ప్రదర్శించి సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు. నియోజకవర్గమంతా పండగ వాతావరణం నెలకొంది. చాలా కాలం తర్వాత బైక్ ర్యాలీ కన్నుల పండుగగా సాగింది.

సంబంధిత పోస్ట్