భీమడోలులో వైసీపీ శ్రేణులు "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, పత్రిక ప్రకటన ప్రతులను దహనం చేశారు.