రాజధానిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?

AP: రాజధానిపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. అమరావతిని కాదని ‘3 రాజధానులు’తో 2024లో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి ఓటమి తర్వాత ‘మావిగన్’ను జనాల్లోకి తీసుకెళ్తోంది. మావిగన్ రాజధానిగా జగన్ పేర్కొనగా.. అది రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం సూచన మాత్రమేనని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నిన్న మావిగన్‌‌తో 2029 ఎన్నికలకు వెళ్తామని జగన్ చెప్పారు. ఇవాళ విజయవాడే రాజధాని అన్నారు. దాంతో రాజధానిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్