అప్పు చేసిన సొమ్మును ఏం చేశారు: మాజీ మంత్రి కన్నబాబు

AP: మాజీ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడలో మాట్లాడుతూ, ప్రభుత్వం మాటల్లోనే గొప్పగా ఉందని, చేతల్లో మాత్రం ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.2.9 లక్షల కోట్లు అప్పు చేసిందని, అయితే సంపద సృష్టి గానీ, ఉద్యోగ కల్పన గానీ జరగలేదని ఆరోపించారు. ఆర్బీఐ నివేదిక ఆధారంగా జగన్ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, చేసిన అప్పుల సొమ్మును ఏం చేశారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్