విజయ్ విజయానికి వైసీపీతో ఏం సంబంధం?

AP: తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపును వైసీపీ నేతలు తమ విజయంగా భావిస్తున్నారు. విజయ్‌‌కు జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆ పార్టీ నేతలు దాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లారు. ప్రచారంలో జగన్‌తో ఉన్న ఫొటోను విజయ్ చూపించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. విజయ్‌లా సోలాగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్‌కు ధైర్యం లేదంటూ ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్‌తో లోకేశ్‌ను పోలుస్తూ ట్రోలింగ్‌కు దిగారు.

సంబంధిత పోస్ట్