మహిళా ఉద్యోగుల్ని స్టేషన్‌లో పెట్టడమేంటి: టీజేఆర్

AP: తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు ధర్నా చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘విజయవాడలోని ధర్నా చౌక్ వద్దకు ఆదివారం సచివాలయ ఉద్యోగులు వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేశారు. కానీ, వాళ్లను సంఘ విద్రోహ శక్తులుగా చూశారు. పోలీసులు వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పడేశారు. మహిళా ఉద్యోగులను కూడా స్టేషన్‌లో పెట్టడమేంటి’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕