పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన వాట్సాప్ అడ్మిన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఓ వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ క్షమాపణలు చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ఆ వార్తను గ్రూపుల్లో షేర్‌ చేసినట్లు అంగీకరించారు. కొద్దిసేపటికే అది అబద్ధమని గుర్తించినట్లు తెలిపారు. తనకు పవన్‌ కల్యాణ్‌పై ఎలాంటి దురుద్దేశం లేదని, జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన అభిమానులు, జనసైనికులకు క్షమాపణలు చెబుతూ.. భవిష్యత్తులో ధ్రువీకరించని వార్తలను షేర్‌ చేయనని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕