AP: ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 18లోపు పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేసి తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఫలితాల విడుదలతో విద్యార్థులు తదుపరి విద్యా ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది.