AP: సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన కొద్ది రోజులుగా కనపడటం లేదని, విదేశీ పర్యటనపై ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. సొంత ఎల్లోమీడియాకు కూడా చంద్రబాబు పర్యటన గురించి తెలియకపోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా కనపడకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ మధ్య సీఎం కుర్చీ కోసం పోరు జరుగుతోందని, లోకేష్ వలనే చంద్రబాబుకు కుర్చీ గండం ఉందని ఆరోపించారు.