AP: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పసన్నకుమార్ రెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించడంపై కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని పరామర్శించడం వైసీపీ సంస్కృతి అని మండిపడ్డారు. మహిళల గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు. ఎవరిని పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్రలని ప్రశ్నించారు.