AP: గత ఐదేళ్ల పాలనలో మావిగన్‌ను రాజధానిగా ఎందుకు ఏర్పాటు చేయాలని జగన్‌కు గుర్తు రాలేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రశ్నించారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో కాలం గడిపారని, అధికారం కోల్పోయాక మావిగన్ గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. ఈవీఎం అవకతవకల వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అనడం సరికాదని, 2019లో జగన్ ఎలా అధికారంలోకి వచ్చారని ఆయన ప్రశ్నించారు.