AP: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని YCP డిమాండ్ చేస్తుంటే CM చంద్రబాబుకు ఎందుకంత భయమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీ గూండాలను ఉసిగొల్సి దాడులు చేయిస్తారా? అని నిలదీశారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోందని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు.