AP: వైసీపీ లెక్క మారిందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో వైసీపీ నాయకులు రచ్చ చేశారు. కానీ, ప్రజలు 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైనాట్ 175 నినాదం విఫలం కావడం.. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు కేవలం 100కు మాత్రమే పరిమితం కావాలని నాయకులు సూచిస్తున్నారట. తాజాగా జరిగిన వెన్నుపోటు కార్యక్రమంపై సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది.