కన్నడలో జనసేన పార్టీలో విస్తృత చేరికలు

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ నెల 25న జరిగిన కార్యక్రమంలో 200 మందికి పైగా కీలక నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, తాళ్లూరి రామ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వ్యవస్థలో మార్పు, కొత్త నాయకత్వ ప్రోత్సాహం లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, ఇది ప్రాంతాలకు, భాషలకు అతీతమైనదని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్