AP: మదనపల్లె బసినికొండలో ఎఫైర్ పచ్చని కాపురంలో కలకలం రేపింది. కులాయి నాయక్, సుజాత భార్యాభర్తలు. వీరి కాపురం సాఫీగా సాగుతున్నా.. సుజాత సమీపంలోని ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. అతడితో చనువుగా ఉండటం గమనించిన కులాయి మందలించాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. అర్ధరాత్రి అతడితో ఫోన్ మాట్లాడుతుండగా గమనించిన భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కత్తితో గొంతు కోసి, డొక్కలో పొడిచి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.