AP: కడప జిల్లా మైదుకూరులోని శ్రీరామ్ నగర్‌లో, వివాహమై మూడేళ్లైనా కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ వివాహిత తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తల్లిదండ్రులు 16 తులాల బంగారం, రూ.7 లక్షలు ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేసినా.. అత్త, మామ, ఆడపడుచులు తనను కాపురానికి పంపకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. న్యాయం చేయాలని ఆమె నిరసన తెలిపింది.