AP: బిహార్ ఎన్నికల్లో తాను కూడా ప్రచారం చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీని ఈ దశాబ్దపు నాయకుడిగా అభివర్ణించారు. సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ పురోభివృద్ధిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పారు. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు అవుతుందని అన్నారు. షెడ్యూల్ నిర్ణయించిన తర్వాత తాను కూడా బిహార్‌లో పర్యటించి ప్రచారం చేస్తానన్నారు.