అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. ‘2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టికొట్టుకుపోయింది. 54వేల ఎకరాల్లో సింగపూర్, జపాన్, ఇస్తాంబుల్ లాంటి రాజధాని కడతామన్నారు. ఇక్కడ అభివృద్ధి, మౌలిక నిర్మాణాలు లేదు. కేవలం పిచ్చి మొక్కలే ఉన్నాయి. చంద్రబాబు మరో 40 వేల ఎకరాలు అడుగుతున్నారు. వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేస్తారా? రియల్ ఎస్టేట్ మాఫియా నడపుతారా?’ అని షర్మిల విమర్శించారు.